news18-telugu
Updated: January 21, 2020, 10:40 AM IST
సీఎం జగన్(ఫైల్ ఫో్టో)
నిన్న శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు ఈ రోజు శాసన మండలి ముందుకు వచ్చాయి. అయితే.. మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో బిల్లు ఆమోదం పొందడంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 సభ్యులు మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే.. బిల్లును అడ్డుకునేందుకు టీడీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా నెగ్గించుకునేందుకు సీఎం జగన్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదం పొందేలా చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. పలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించిన జగన్.. మూజువాణి ఓటువైపే మొగ్గారని సమాచారం. ఇదే విషయాన్ని పలువురు సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
January 21, 2020, 10:40 AM IST