నేడు అసెంబ్లీకి టీడీపీ దూరం... ఆర్డినెన్స్ తెచ్చే పనిలో జగన్?

బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. సభా సంప్రదాయాల్ని పాటించట్లేదంటూ... ఇవాళ సభకు హాజరు కాకూడదని డిసైడయ్యారు.

news18-telugu
Updated: January 23, 2020, 9:13 AM IST
నేడు అసెంబ్లీకి టీడీపీ దూరం... ఆర్డినెన్స్ తెచ్చే పనిలో జగన్?
వైఎస్ జగన్
  • Share this:
ఇవాళ అసెంబ్లీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది టీడీపీ. ఇందుకు సంబంధించి ఆ పార్టీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రధానంగా నిన్న శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA బిల్లులపై చర్చ సందర్భంలో... వైసీపీ మంత్రులు అడ్డుతగిలారనీ, సభా సంప్రదాయాల్ని పాటించకుండా... తమ ఎమ్మెల్సీలపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని... టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో... ఇవాళ సభా కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయించారు. అసెంబ్లీ కార్యక్రమాల్ని బహిష్కరించిన టీడీపీ... మండలిలో జరిగిన పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు నిన్న మండలిలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ కూడా సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి... అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన ఇంట్లో న్యాయ నిపుణులు, ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు