సీఎం జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ‘అభినందనలు’...

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఎన్టీవీ నిర్వహించిన పాయింట్ బ్లాంక్ కార్యక్రమంలో జగన్ ఏడాది పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారనే అంశంపై జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ‘మార్కులు ఏడాది అయ్యాక ఇవ్వొచ్చు. ఇంకా నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. ఏడాది అయ్యాక చూద్దాం. చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు మేనిఫెస్టోను కేవలం ఎన్నికల్లో విజయం కోసమే అనుకుంటారు. మేనిఫెస్టోలో చెప్పినవి చేయరు. కానీ జగన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.’ అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారించిన తర్వాత కూడా తాను, జగన్ విమానాశ్రయంలో ఎదురుపడ్డామని ‘నమస్కారం అంటే నమస్కారం’ అని పలకరించుకున్నామని కూడా జేడీ చెప్పారు. ఓ ఉద్యోగిగా తన డ్యూటీ తాను చేశానన్న జేడీ లక్ష్మీనారాయణ మిగిలిన వాళ్లు కూడా కలుస్తుంటారని తెలిపారు.

    పవన్ కళ్యాణ్‌కు షాక్... జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై | Cbi ex jd Lakshmi Narayana quits pawan kalyan janasena party ak
    లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)


    తాను ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయడానికి వచ్చానని, పవన్ కళ్యాణ్‌లో ఫుల్ టైమ్ పాలిటిక్స్ కనిపించకపోవడం వల్లే జనసేనకు రాజీనామా చేశానని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఏ పార్టీలో చేరతారని ప్రశ్నించగా, ప్రస్తుతానికి తాను ఏ పార్టీలోనూ లేనన్నారు. గత రెండు వారాల్లోనే చాలా మంది తనను నాలుగు పార్టీల్లో చేర్చేశారంటూ చమత్కరించారు. సీఎం కావడం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుందని ప్రశ్నించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: