సీఎం జగన్‌పై ఈ రెబ‌ల్ ఎంపీదే పైచేయి.. అది తప్ప మరో దారిలేదు.

మరోవైపు ఇప్ప‌టికే బిజేపీ అండ‌దండ‌లు ఉన్నాయి కాబ‌ట్టి జ‌గ‌న్ పార్టీని భవిష్య‌త్‌లో ఎంత సాధ్య‌మైతే అంత‌వ‌ర‌కు ఇబ్బంది పెట్ట‌డానికి వీలుంటుందని ఈ రెబ‌ల్ ఎంపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 13, 2020, 4:59 PM IST
సీఎం జగన్‌పై ఈ రెబ‌ల్ ఎంపీదే పైచేయి.. అది తప్ప మరో దారిలేదు.
రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
(బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఏపీలో డైలీ సీరియ‌ల్ సాగుతోంది. ఐతేఅయితే ఈ ఎపిసోడ్‌ను జ‌గ‌న్ అండ్ కో ఎందుకు సాగ‌దీసుకుంటున్నార ప్ర‌శ్న‌లు ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పార్టీకి ఉన్న అన్ని అస్త్రాలను ఒక్క ర‌ఘు రామ‌కృష్ణ‌రాజు కోసమే ఎందుకు వినియోగిస్తోంది. ఏ ఉద్దేశంతో ఆయన ఇలా వ్య‌వ‌హారిస్తున్నారో జ‌గ‌న్‌కు అవ‌గాహన వ‌చ్చిన‌ త‌రువాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిన్న మొన్న‌టి వర‌కు ఈ అంశంపై అంటీముట్ట‌న‌ట్లు ఉన్న బీజేపీ.. ఇప్పుడు బ‌హిరంగంగానే ర‌ఘురామ‌ కృష్ణ‌ంరాజును మ‌ద్ద‌తు తెలుపుతోంది.

ఇటీవల ఒక బిజేపీ నేత విజ‌య‌సాయిరెడ్డికి ఇచ్చిన కౌంట‌ర్‌తో ఇది స్ప‌ష్టమైంది. ర‌ఘురామ‌ కృష్ణ‌ంరాజు మీ పార్టీ రంగు వెలిసిపోయేలా చేస్తున్నారని వ్యాఖ్యానించ‌డంతో ఈ ఎపిసోడ్‌లో బీజేపీ పాత్ర స్ప‌ష్టంగా అర్ధ‌మైంది. ర‌ఘురామ‌ కృష్ణ‌ంరాజును పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి త‌న‌తో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక్క మాట‌తో తేల్చేసే అంశాన్ని జ‌గ‌న్ ఎందుకు రాద్ధాంతం చేసుకుంటున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మరోవైపు ర‌ఘురామ‌ కృష్ణ‌ంరాజు చేసిన వ్యాఖ్య‌ల‌తో తన‌పై అనర్హ‌త వేటు వేయ‌డానికి చ‌ట్ట‌ప‌ర‌మైన అవ‌కాశం లేన‌ప్పుడు.. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం కూడా వృథా ప్రయత్నం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఐతే ఈ మొత్తం ఎపిసోడ్‌ను ర‌ఘురామ‌ కృష్ణ‌ంరాజు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప‌క్కా వ్యూహంతోనే తొలి నుంచి వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్న ఈ రెబ‌ల్ ఎంపి.. ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ చేత్తోనే తనను సస్పెండ్ చేసే స్థాయికి వరకు తెచ్చుకున్నారు. దీంతో ఈ ఫైట్‌లో ర‌ఘురామ‌ కృష్ణ‌ంరాజే విజ‌యం సాధించాడ‌ని చెప్పుకోవాలి. ఇప్పుడు పార్టీ ఆయన్ను స‌స్పెండ్ చేస్తే ఎంపీ ప‌ద‌వికి వ‌చ్చే నష్టం ఏం లేదు.

మరోవైపు ఇప్ప‌టికే బిజేపీ అండ‌దండ‌లు ఉన్నాయి కాబ‌ట్టి జ‌గ‌న్ పార్టీని భవిష్య‌త్‌లో ఎంత సాధ్య‌మైతే అంత‌వ‌ర‌కు ఇబ్బంది పెట్ట‌డానికి వీలుంటుందని ఈ రెబ‌ల్ ఎంపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రrతం పార్టీ కీల‌క నేత‌ల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇదే అంశంపై స‌మావేశం ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా చాలా మంది ఆయ‌న్ను పార్టీ నుంచి త‌ప్పించి చెతులు దులుపుకుంటే మంచిద‌నే అభిప్రాయాలు వ‌్యక్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం పార్టీ నుంచే కాకుండా ఎంపీ ప‌ద‌వి నుంచి కూడా త‌ప్పించాలని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో వైసీపీ పార్టీకి ప్ర‌భుత్వానికి చాలా న‌ష్టం జ‌రుగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 13, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading