'మేము 150 మంది.. తలుచుకుంటే మీరు సభలో కూడా కూర్చోలేరు'

టీడీపీ సభ్యుల గందరగోళం నడుమనే సీఎం జగన్ వడ్డీ లేని రుణాలపై మాట్లాడారు. 2014-15 సంవత్సరానికి పంట రుణాలు రూ.29వేల 658కోట్లు అయితే..ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రుణాలు కేవలం రూ.44.3కోట్లు మాత్రమే అన్నారు.

news18-telugu
Updated: July 12, 2019, 11:49 AM IST
'మేము 150 మంది.. తలుచుకుంటే మీరు సభలో కూడా కూర్చోలేరు'
వైఎస్ జగన్ (Image : Twitter)
news18-telugu
Updated: July 12, 2019, 11:49 AM IST
వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో అధికార-ప్రతిపక్షానికి మధ్య వాగ్వాదం చర్చ జరిగింది. వడ్డీ లేని రుణాలపై సీఎం జగన్ నిండు సభలో అబద్దాలు చెప్పారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. దానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.సభను తప్పుదోవ పట్టించినందుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని సభా హక్కుల నోటీసు ఇచ్చారు.మాజీ సీఎం చంద్రబాబు పట్ల హేళనగా మాట్లాడారని.. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు గాడిదలు కాశారా? అని మాట్లాడటం సరికాదని అన్నారు. అందుకు జగన్ సభలో క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడ్డారు.

టీడీపీ సభ్యుల గందరగోళం నడుమనే సీఎం జగన్ వడ్డీ లేని రుణాలపై మాట్లాడారు. 2014-15 సంవత్సరానికి పంట రుణాలు రూ.29వేల 658కోట్లు అయితే..ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రుణాలు కేవలం రూ.44.3కోట్లు మాత్రమే అన్నారు. అలాగే 2015-16లో వడ్డీ లేని రుణాలు రూ.2283 కోట్లకు గాను రూ.31కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు.2017-18లో రూ.2703కోట్లకు గాను 182కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో టీడీపీ సభ్యులు మరింత వాగ్వాదానికి దిగడంతో సీఎం జగన్ ఫైర్ అయ్యారు.సభలో తాము 150మంది ఉన్నామని.. తాము తలుచుకుంటే టీడీపీ సభ్యులు వారి స్థానాల్లో కూడా కూర్చోలేరని హెచ్చరించారు. శరీరాలు కాదు.. బుద్ది పెరగాలని పరోక్షంగా టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడిని విమర్శించారు.


First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...