YS Jagan: ‘ఆ విషయంలో సీఎం జగన్ వరల్డ్ రికార్డు’

YS Jaganmohan Reddy: ప్రతిపక్షాలపై కక్ష సాధింపుపై వైసీపీకి ఉన్న ఆసక్తిలో వందోవంతు రాష్ట్రం అభివృద్దిపై, ప్రజల బాగోగులపై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని యనమల రామకృష్ణుడు అన్నారు.

news18-telugu
Updated: September 24, 2020, 3:29 PM IST
YS Jagan: ‘ఆ విషయంలో సీఎం జగన్ వరల్డ్ రికార్డు’
వైఎస్ జగన్
  • Share this:
Andhra Pradesh: రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరల్డ్ రికార్డు సృష్టించారని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఓ ప్రకటనలో ఆయన ఏపీలో వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మీద అనుమానాలు వ్యక్త0 చేశారు. ‘సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి కాదు. తన కేసుల భవిష్యత్తే తప్ప రాష్ట్ర భవిష్యత్ జగన్ కు పట్టదు. చివాట్లు తినడానికే ఢిల్లీ వెళ్లినట్లు మీడియాలో చూస్తున్నాం. రాష్ట్రంలో అరాచకాలు-అవినీతి చేయడం, ఢిల్లీవెళ్లి చివాట్లు తినడమే జగన్ పని. ప్రత్యేక హోదా తన(జగన్)కు సంబంధం లేని అంశమైంది. ప్రత్యేక హోదా పేరెత్తడం మరిచిపోయి 16నెలలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడా ఊసే గాలికి వదిలేశారు. విభజన చట్టంలో అంశాల అమలుపై దృష్టి లేదు. తెలంగాణతో పరిష్కరించాల్సిన సమస్యలపై ఆసక్తి లేదు. కుంభకోణాలపై ఉన్న శ్రద్దలో వందోవంతు కేంద్రనిధులు రాబట్టడంపై లేదు. దోచుకోవడం - దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. రాజధాని అమరావతి అంశం కోర్టులో ఉండగా, పదేపదే దానిపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడం గర్హనీయం.’ అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Cm ys jagan meeting with amit shah, cm ys jagan news, amit shah news, cm ys jagan delhi tour, ap news, అమిత్ షాతో సీఎం జగన్ భేటీ, సీఎం జగన్ న్యూస్, అమిత్ షా న్యూస్, ఏపీ న్యూస్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్


ఏదేమైనా తన పంతం నెరవేర్చుకోవాలన్న దురాలోచనే తప్ప, రాష్ట్రానికి- ప్రజలకు వాటిల్లే నష్టాలపై దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు. సంజాయిషీలు చెప్పడానికే సిఎం ఢిల్లీ పర్యటనలు తప్ప, రాష్ట్రానికి రావాల్సినవి సాధించడానికి కాదన్నారు యనమల. ‘ఇప్పటికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నిమార్లు ఢిల్లీ వెళ్లారు..? రాష్ట్రానికి ఏం సాధించారు? రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. ఇన్నిమార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్ర మంత్రులతో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ లు ఎందుకని పెట్టలేదు? తానొక్కడే అయినా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని ఇది అడిగాం, ఇవి ఇచ్చారని ఎందుకని చెప్పలేక పోయారు.? ఏదో కంటితుడుపుగా సీఎంవో ప్రకటనలే తప్ప జగన్మోహన్ రెడ్డి నోరు తెరవక పోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి. తన కేసులపై విచారణ ఎక్కడ వేగవంతం అవుతుందో, ఏడాదిలో ఎంక్వైరీ పూర్తి చేస్తారో అనే భయమే తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోక పోవడాన్ని ఖండిస్తున్నాం.’ అని యనమల ఓ ప్రకటనలో అన్నారు.

యనమల రామకృష్ణుడు(ఫైల్ ఫొటో)


16నెలల్లో రూ.లక్షా 28వేల కోట్ల అప్పులు తేవడం గిన్నెస్ రికార్డులోకి, లిమ్కా రికార్డులోకి ఎక్కాల్సిన అంశం అని యనమల ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో 31వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో చంద్రబాబు గిన్నెస్ రికార్డు సాధిస్తే, నెలకు రూ.8వేల కోట్ల అప్పులు తేవడంలో జగన్  రికార్డు సృష్టించారన్నారు. ‘60నెలల్లో పోలవరం పనులు 72% టిడిపి పూర్తిచేస్తే, 16నెలల్లో 2% పనులు కూడా వైసీపీ చేయక పోవడం గర్హనీయం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా మూడు ప్రాంతాల్లో టిడిపి ప్రభుత్వం నెలకొల్పిన 11 అత్యున్నత విద్యా సంస్థల్లో అభివృద్ది పనులన్నీ నత్తనడకే.. వాటిలో పనులన్నీ ఇంత మందకొడిగా జరుగుతుంటే పూర్తి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఎన్ని దశాబ్దాలు పడుతుంది? టీడీపీ హయాంలో రూ.లక్షల కోట్లతో నిర్మాణాలు చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్ ప్రాజెక్టులు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పేదల ఇళ్లు, పనులన్నింటినీ నిలిపేశారు. వేలాది టిప్పర్లు, భారీ మెషీనరీ, వేలాది ఇంజనీర్లు, ఉద్యోగులు, నిర్మాణ కూలీలతో టీడీపీ హయాంలో కోలాహలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హింసా విధ్వంసాలకు వేదిక కావడం బాధాకరం.’ అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపుపై వైసీపీకి ఉన్న ఆసక్తిలో వందోవంతు రాష్ట్రం అభివృద్దిపై, ప్రజల బాగోగులపై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 
Published by: Ashok Kumar Bonepalli
First published: September 24, 2020, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading