అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్

ఈ నెల 18న తెల్లవారుజామున 03.15 నిమిషాలకు మాధవి స్వగ్రామం శరభన్నపాలెలో పెళ్లి వేడుక జరిగింది. బంధు మిత్రుల ఆశీర్వాదాలు, మేలతాళాల మధ్య మాధవి-శివప్రసాద్ ఏడు అడుగులు వేశారు

news18-telugu
Updated: October 22, 2019, 8:48 PM IST
అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
ఎంపీ గొడ్డేటి మాధవి రిసెప్షన్‌లో సీఎం జగన్
news18-telugu
Updated: October 22, 2019, 8:48 PM IST
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి రిసెప్షన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా విశాఖపట్టణం వెళ్లిన జగన్.. రుషికొండ బీచ్‌లో జరిగిన ఎంపీ రిసెప్షన్‌కు హాజరయ్యారు. కొత్త జంట గొడ్డేటి మాధవి-శివప్రసాద్‌‌ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తన బాల్యమిత్రుడు శివప్రసాద్‌ను మాధవి వివాహం చేసుకున్నారు. ఈ నెల 18న తెల్లవారుజామున 03.15 నిమిషాలకు మాధవి స్వగ్రామం శరభన్నపాలెలో పెళ్లి వేడుక జరిగింది. బంధు మిత్రుల ఆశీర్వాదాలు, మేలతాళాల మధ్య మాధవి-శివప్రసాద్ ఏడు అడుగులు వేశారు.
ఎంపీ మాధవి రిసెప్షన్‌లో సీఎం జగన్

వివాహానికి ముందు ఈ జంట తీసుకున్న ప్రివెడ్డింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాధవి భర్త శివప్రసాద్ స్వస్థలం విశాఖపట్టణం జిల్లా గొలుగొండ మండలం కెడిపేట గ్రామం. ఎంబీయే పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇక గతంలో టీచర్‌గా పనిచేసిన గొడ్డేటి మాధవి ఏప్రిల్/మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అరకులో టీడీపీ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై సుమారు 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు మాధవి.



First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...