ఏపీలో తొలిసారిగా డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థ ప్రారంభం

‘పచ్చని తిరుపతి-అత్యంత ఆవాసయోగ్యమైన తిరుపతి’అనే నినాదంతో ఎన్టీలఆర్ విగ్రహం నుంచి ర్యాలీని సీఎం ప్రారంభించారు.తిరుపతిలో నందనవనాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు.

news18
Updated: September 22, 2018, 2:35 PM IST
ఏపీలో తొలిసారిగా డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థ ప్రారంభం
డిజిటల్ డోర్ నెంబర్ సిస్టమ్‌ను ప్రారంభించిన సీఎం
  • News18
  • Last Updated: September 22, 2018, 2:35 PM IST
  • Share this:
చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోనే మొదటిసారిగా డిజిటల్ డోర్ నెంబర్ల
వ్యవస్థను ప్రారంభించారు. సీఎం పాదయాత్ర ద్వారా సభా స్థలికి చేరుకున్నారు.‘పచ్చని తిరుపతి-అత్యంత ఆవాసయోగ్యమైన

తిరుపతి’అనే నినాదంతో ఎన్టీలఆర్ విగ్రహం నుంచి ర్యాలీని సీఎం ప్రారంభించారు. ఈ ర్యాలీ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ వరకు
కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంఘాలు భారీగా తరలివచ్చాయి.

అంతకుముందు తిరుపతిలో నగరవనాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. తిరుపతి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. రెండుకోట్ల
వ్యయంతో నిర్మించిన నగరవనాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. సీఎం పిలుపుతో నగర ప్రజలు ఇంటికో చెట్టు
నాటాలన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 110 మున్సిపాలిటీల పరిస్థితి ఘోరంగా ఉండేదన్నారు. అలాంటి మున్సిపాలిటీలనుదేశంలో ఏ రాష్ట్రాల సీఎంలు చేయని రీతిలో అభివ‌ృద్ధి చేశారన్నారు. తిరుపతి నగరంలో ఏర్పాటైన డిజిటల్ డోర్ నెంబర్ల విధానంతో
ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు సీఎం. అతిపెద్ద ప్రమాదం నుంచి వెంకటేశ్వరస్వామి కాపాడి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని
కల్పించారన్నారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు.

నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తిరుపతిని నెంబర్ వన్ పార్క్ సిటీగా ఏర్పాటు చేస్తామన్నారు. నగంరలో పార్కుల నిర్మాణాన్ని డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామన్నారు. తిరుపతిని నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా తయారు చేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు చంద్రబాబు. నగరంలో ఉన్న నిరుపేదలందరికీ సొంతింటి కళను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
చిత్తూరును ఇండస్ట్రీ హబ్‌గా మారుస్తామన్నారు. పచ్చదనం 50 శాతం పెరగాలన్న లక్ష్యంతోనే వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: September 22, 2018, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading