Home /News /politics /

CM CHANDRABABU TOUR IN PADERU

నేడు పాడేరుకు చంద్రబాబు....కిడారి,సోమ కుటుంబాలకు పరామర్శ

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

మావోయిస్టు చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుటుంబాల్ని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన గురువారంతో ముగిసింది. న్యూయార్క్ నుంచి బయల్దేరిన ఆయన రాత్రి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ్నుంచి శుక్రవారం తెల్లవారుజామునే.. హైదరాబాద్‌కు వచ్చారు. ఇవాళ విశాఖ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. మావోయిస్టు చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుటుంబాల్ని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పాడేరుకు చేరుకుంటారు. అక్కడ కిడారి కుటుంబసభ్యుల్ని పరామర్శించి... అనంతరం అరకులో సివేరి సోమ కుటుంబ సభ్యలను సీఎం కలవనున్నారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Maoist attack

    తదుపరి వార్తలు