• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CLOSE WINES BARS AND CINEMA THEATERS TO AVOID CORONA VIRUS SPREAD AND LOCK DOWN DEMANDS CONGRESS MLA JAGGA REDDY AK

JaggaReddy: విద్యాసంస్థలు మూసివేత.. వాటి సంగతేంటన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

JaggaReddy: విద్యాసంస్థలు మూసివేత.. వాటి సంగతేంటన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

జగ్గారెడ్డి (File- credit - twitter)

JaggaReddy: విద్యాసంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలపై స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.

  • Share this:
    ఇప్పుడు ఉన్న కరోనా ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు ,కాలేజీలు మూసి వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. లాక్ డౌన్ వచ్చి మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడొద్దు అనుకుంటె వైన్ షాపు లు, బార్‌లు, సినిమా థియేటర్లు, పార్క్‌లు మూసివేయాలని అన్నారు. విద్యాసంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ప్రైవేటు స్కూల్లు ,కాలేజీలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలపై స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ మే ఆర్థిక సంక్షోభం లో ఉన్నప్పుడు ప్రజలు ఆర్థిక సంక్షోభం లో ఉండరా అని ప్రశ్నించారు.

    ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టించుకోవడం అంటె విద్యార్థులు ,విద్యార్థుల తల్లిదండ్రులను హాత్య చేసినట్లుగానే భావించాల్సి వస్తుందని అన్నారు. ప్రైవేటు యాజమాన్యాల వత్తిడి వల్ల మానసికంగా తల్లిదండ్రులకు లేని రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ,మధ్యతరగతి కుటుంబ తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ఓక పరిష్కార మార్గం చూపించాలని జగ్గారెడ్డి కోరారు.

    కరోనా ఇంతటితో పోయేది కాదు.. ఇంకో సంవత్సరం కరోనా ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు చెల్లించిన ఫీజులో కనీసం సగమయినా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు చెల్లించాలని అన్నారు. అలా కాని పక్షంలో భవిష్యత్‌లో ఎప్పుడు ప్రైవేటు స్కూల్లు ప్రారంభమైనా ఒకే సంవత్సరం ఫీజు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు జీతాలు ఆపకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు