‘మీరే రిగ్గింగ్ చేసుకోండి.. మేం ఇంట్లో పడుకుంటాం’.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

‘మీరేం పోస్టాఫీస్ కాదు కదా. స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా. లేకపోతే ఈసీని తీసేయమనండి.’ అని చంద్రబాబునాయుడు అన్నారు.

  • Share this:
    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇళ్లలో వరుసగా ఐటీ దాడులు జరగుతున్నాయంటూ ఆగ్రహించిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎందుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ద్వివేదీతో మాట్లాడిన చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో పావుగా మారిపోయారని మండిపడ్డారు. ఆరోపణల మీద విచారణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘నిజాలు ఎవరు పరిశీలిస్తున్నారు? ఆయన (మోదీ) వెరిఫై చేస్తారా? ఆయన్నే చేయమనండి. నేను ఢిల్లీలో ఫైట్ చేస్తా. మీ ఆఫీస్ మూసేయండి. అంతా ఏకపక్షంగా చేయండి. రిగ్గింగ్ చేసుకోండి. మేం ఇంట్లో పడుకుంటాం. మీరు స్వతంత్ర అధారిటీ కదా? ఢిల్ీ చెప్పినట్టు ఎందుకు నడుచుకుంటున్నారు? మీరేం పోస్టాఫీస్ కాదు కదా. స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా. లేకపోతే ఈసీని తీసేయమనండి. ఆయన్నే క్లర్క్‌ని పెట్టుకుని చూసుకోమనండి. మేమూ చూస్తాం ఈసీ ఏంటో.’ అని చంద్రబాబునాయుడు సీఈవో ద్వివేదీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది.
    First published: