టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో బీజేపీ కార్యకర్త వాగ్వాదం.. ఏం పీకలేరంటూ..

ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో పక్కనున్నవారు ఇద్దరికీ సర్దిచెప్పారు. బీజేపీ కార్యకర్తను అక్కడినుంచి పంపించడంతో ఉద్రిక్తత కాస్త చల్లబడింది. మక్తల్ మండంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: July 29, 2019, 1:37 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో బీజేపీ కార్యకర్త వాగ్వాదం.. ఏం పీకలేరంటూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మక్తల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ బీజేపీ కార్యకర్త.. 'మీరేమీ పీకలేరు..' అంటూ ఆయనకు సవాల్ విసిరాడు. పెన్షన్ ధ్రువీకరణ పత్రాల పంపిణీ సందర్భంగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పత్రాల పంపిణీ సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్త.. ఎమ్మెల్యేకు ఏదో సలహా ఇచ్చారు. దీంతో నువ్వేంటి నాకు చెప్పేది.. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అని ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను మర్యాదగానే మాట్లాడుతున్నానని.. మీ మర్యాద ఎలా ఉందో లైవ్‌లోనే చూశామని బీజేపీ కార్యకర్త ఎద్దేవా చేశారు. దీంతో మీ బీజేపీవోడు,నరేంద్ర మోదీ నన్నేమీ పీకలేరంటూ ఎమ్మెల్యే చిట్టెం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అంతే ఘాటుగా స్పందించిన సదరు బీజేపీ కార్యకర్త.. నన్ను మీ టీఆర్ఎస్‌వోడు ఏం పీకలేడు.. ఇది నా సవాల్ అంటూ తీవ్రంగా స్పందించారు.

ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో పక్కనున్నవారు ఇద్దరికీ సర్దిచెప్పారు. బీజేపీ కార్యకర్తను అక్కడినుంచి పంపించడంతో ఉద్రిక్తత కాస్త చల్లబడింది. మక్తల్ మండంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా,2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>