వేములవాడ టీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. మున్సిపల్ కార్యాలయంలోనే రెండు వర్గాలుగా విడిపోయి..

వేములవాడ టీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. మున్సిపల్ కార్యాలయంలోనే రెండు వర్గాలుగా విడిపోయి..

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘర్షణకు దిగిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీఆర్‌ఎస్ నాయకుల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు.

 • Share this:
  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీఆర్‌ఎస్ నాయకుల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. వివరాలు.. మేములవాడ మున్సిపల్ కార్యాలయంలో దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ జయంతి సందర్భంగా చెర్మన్, వైఎస్ చైర్మన్‌ల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసే క్రమంలో ఈ వివాదం చోటుచేసుకుంది. దీంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ల వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు నెట్టేసుకుంటూ ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న కొందరు ఆపేందుకు ప్రయత్నించిన వారు పట్టించుకోకుండా బూతులు తిట్టుకున్నారు.

  రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. ఒక దశలో ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకున్నారు. ఇక, వేములవాడ మున్సిపల్ చైర్మన్రామతీర్థం మాధవికి, వైఎస్ చైర్మన్ మధు రాజేందర్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే వార్తలు కొద్ది నెలలుగా చక్కర్లు కొడుతున్నాయి. వీరి మధ్య విబేధాలను పలువురు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడ వారి మధ్య విబేధాలు సమసిపోలేదు. ఈ క్రమంలో ఇన్ని రోజులు అంతర్గత సాగిన విబేధాలు.. నేడు రచ్చకెక్కాయి.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు