Home /News /politics /

సీఎం డబ్బులిస్తారంటూ.. భవన నిర్మాణ కార్మికుల వద్ద CITU నేత వసూళ్లు

సీఎం డబ్బులిస్తారంటూ.. భవన నిర్మాణ కార్మికుల వద్ద CITU నేత వసూళ్లు

కొండపల్లిలోని కొత్తగేటులో కొంతమంది కార్మికుల వద్ద నుండి పెద్దమొత్తంలో వసూళ్ళు చేసిన కుమార్ అనే CITU నాయకుడిని కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు.

    ఇసుక కొరతతో అసలే పనులు లేక పస్తులు ఉంటున్న భవన నిర్మాణ కార్మికులను కొందరు అదును చూసి మోసం చేస్తున్నారు. సీఎం జగన్ దగ్గర నుంచి పదివేలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి మనిషికి 50/- చొప్పున వసూలు చేస్తున్న CITU నాయకుడిని భవన నిర్మాణ కార్మికులు పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు నిర్మాణ కార్మికులు. ఈ రోజు ఉదయం కొండపల్లి లోని కొత్తగేటులో కొంతమంది కార్మికుల వద్ద నుండి పెద్దమొత్తంలో వసూళ్ళు చేసిన కుమార్ అనే CITU నాయకుడిని కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు.

    ప్రభుత్వం ఇంకా ఈ పదకం పెట్టలేదు కదా మీరెందుకు ఇలా అక్రమంగా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో కుమార్ ఈ వసూళ్లంతా తమ పార్టీకి సభ్యతమంటూ మాట మార్చడంతో భవన కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్పటి వరకు వసూలు చేసిన పెద్దమొత్తాన్ని తిరిగి కార్మికులకు ఇచ్చివేసినట్లు తెలిపారు. అయితే విచారణ నిమ్మిత్తం CITU నాయకుడిని పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Sand issue, Sand shortage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు