పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై దేశంలో దుమారం రేగుతున్న వేళ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. CAAకి సంపూర్ణ మద్దతు తెలిపిన ఆయన... పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశ పౌరులెవరికీ నష్టం జరగదని అభిప్రాయడ్డారు. ఒకవేళ ముస్లింలకు నిజంగానే అన్యాయం జరిగితే, వాళ్ల కోసం తానే ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. ఇక దేశంలో నివసిస్తున్న బయటి వ్యక్తులను గుర్తించేందుకే కేంద్రం NPR (జాతీయ జనాభా పట్టిక)ను కేంద్రం తీసుకొస్తోందని చెప్పారు రజినీకాంత్.
Rajinikanth: Citizenship Amendment Act will not affect any citizen of our country, if it affects Muslims then I will be the first person to stand up for them. NPR is a necessity to find out about the outsiders. It has been clarified that NRC has not been formulated yet. pic.twitter.com/wyXMCY8pH9
— ANI (@ANI) February 5, 2020
ఐతే రజినీకాంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో కొత్తేమీ లేదని.. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ని ఉన్నది ఉన్నట్లుగా ఆయన చదివారని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు రజినీకాంత్ ఇకపై నటించాల్సిన అవసరం లేదని..బీజేపీలో చేరితే బాగుంటుందని సెటైర్లు వేశారు.
No reason for @rajinikanth to pretend that he is going to form a new political party, might as well join the @BJP4India and spare us the charade.
— Karti P Chidambaram (@KartiPC) February 5, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CAA, NRC, Rajnikanth