Home /News /politics /

CITIZENSHIP ACT PROTESTS NO INDIAN CITIZEN WILL BE AFFECTED BY LAW CLARIFIES PM MODI SK

Citizenship Act: ఆందోళనల వెనక కాంగ్రెస్ కుట్ర: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

పౌరసత్వం చట్టంపై విపక్ష పార్టీలు లేనిపోని అపోహలు సృష్టించి..ప్రజలను భయపెడుతున్నాయని విరుచుకుపడ్డారు మోదీ. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

    పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, హింసను ప్రధాని మోదీ ఖండించారు. దీని వెనక విపక్షాల కుట్ర ఉందని మండిపడ్డారు. పాకిస్తానీలకు పౌరసత్వం ఇవ్వాలని కోరుకుంటోందని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఝార్ఖండ్‌లోని బెర్హైత్‌లో ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పౌరసత్వం చట్టంపై విపక్ష పార్టీలు లేనిపోని అపోహలు సృష్టించి..ప్రజలను భయపెడుతున్నాయని విరుచుకుపడ్డారు మోదీ. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

    పౌరసత్వ చట్టం వల్ల దేశంలోని ఏ మతానికి గానీ, ఏ పౌరుడికి గానీ నష్టం ఉండదు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ప్రజల్లో లేని పోని అపోహలు కల్పిస్తున్నాయి. ముస్లిం ప్రజలను తమ రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నాయి. విద్యార్థుల భవిషష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజించు..పాలించు విధానాన్ని అనుసరిస్తోంది. గెరిల్లా పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. పాకిస్తానీలకు భారత పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. అని మండిపడ్డారు మోదీ.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Citizenship Act, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు