పౌరసత్వ సవరణ చట్టం.. మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం నెలకొన్న వివాదాస్పద వాతావరణంలో రెండు విషయాలను ఆ దృష్టితో చూడరాదన్నారు. 1) దేశ విభజన మతం ప్రాతిపదికన జరిగింది. 2). ప్రజాస్వామ్యం కచ్చితంగా విభజితంగానే ఉండాలి.

news18-telugu
Updated: December 14, 2019, 10:50 AM IST
పౌరసత్వ సవరణ చట్టం.. మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ (File Photo)
  • Share this:
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విభజిత ప్రజాస్వామ్యం అక్కర్లేదని భావిస్తున్నవారు ఉత్తరకొరియా వెళ్లిపోవచ్చునని అన్నారు.ప్రస్తుతం నెలకొన్న వివాదాస్పద వాతావరణంలో రెండు విషయాలను ఆ దృష్టితో చూడరాదన్నారు. 1) దేశ విభజన మతం ప్రాతిపదికన జరిగింది. 2). ప్రజాస్వామ్యం కచ్చితంగా విభజితంగానే ఉండాలి. ఈ రెండు విషయాలతో ఏకీభవించనివారు నిరభ్యంతరంగా ఉత్తరకొరియా వెళ్లిపోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ట్వీట్స్‌కు కొద్ది గంటల ముందు వందలాది ప్రజలు రాజ్‌భవన్‌ వద్దకు చేరుకుని లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు,20 మంది నిరసనకారులు గాయపడ్డారు.,
Published by: Srinivas Mittapalli
First published: December 14, 2019, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading