తెలంగాణ ఎన్నికల్లో వెలవెలపోయిన సినీ గ్లామర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా బలం ముందు సినీ గ్లామర్ వెలవెల పోయింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కూటమికి సినీ గ్లామర్ తోడైన కేసీఆర్ కారు జోరును ఏమాత్రం ఆపలేకపోయింది.

news18-telugu
Updated: December 11, 2018, 3:33 PM IST
తెలంగాణ ఎన్నికల్లో వెలవెలపోయిన సినీ గ్లామర్
బాలకృష్ణ, విజయశాంతి, ఖుష్బూ
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా బలం ముందు సినీ గ్లామర్ వెలవెల పోయింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కూటమికి సినీ గ్లామర్ తోడైన కేసీఆర్ కారు జోరును ఏమాత్రం ఆపలేకపోయింది. ముఖ్యంగా కూటమి తరుపున కూకట్ పల్లి సహా హైదరాబాద్‌లో ప్రజాకూటమి తరుపున సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం చేసిన ఓట్లను మాత్రం రాల్చలేకపోయింది.

మరోవైపు అక్క సుహాసిని తరుపున కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్‌ను రప్పించలేకపోయిన టీడీపీ నేతలు...ప్రజలను ఓటేయడానికి ఎలా రప్పిస్తారని టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేసినట్టే ప్రజలు కూటమికి ఓటమి రుచి చూపించారు. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఖమ్మంలో కాస్తా కూస్తో చెప్పుకోదగిన సీట్లను కూటమి రాబట్టింది.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయ శాంతి ప్రచారం చేసిన చాలా చోట్ల కాంగ్రెస్ ఓటమిపాలైంది. మరోవైపు సినీ నటి ఖుష్బూ, నగ్మా ప్రచారం చేసిన చోట్ల కూడా కాంగ్రెస్‌కు ఓట్లను రాల్చలేకపోయింది. మొత్తానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తరుపున సినీ నటులు ప్రచారం చేసిన కేసీఆర్ దూకుడును ఆపలేకపోవడం విశేషం.

First published: December 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>