• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CID RAIDS IN EX MINSTER NARAYANA HOUSES AND OFFICE IN VIJAYAWADA HYDERABAD AND NELLORE OVER AMARAVATI LANDS ISSUE FULL DETAILS HERE PRN

Amaravathi Lands Scam: స్పీడ్ పెంచిన సీఐడీ.. నారాయణ ఇంట్లో సోదాలు.. చంద్రబాబు కంటే ఒకరోజు ముందే...

Amaravathi Lands Scam: స్పీడ్ పెంచిన సీఐడీ.. నారాయణ ఇంట్లో సోదాలు.. చంద్రబాబు కంటే ఒకరోజు ముందే...

మాజీ మంత్రి నారాయణ (ఫైల్)

విజయవాడ (Vijayawada), నెల్లూరు (Nellore), హైదరాబాద్ (Hyderabad) సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. నారాయణకు (Minister Narayana) చెందిన నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో అమరావతి భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు.. బుధవారం మాజీ మంత్రి నారాయణకు నోటీసులివ్వడంతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. నారాయణకు చెందిన నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. అన్ని చోట్లా ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇన్ని చోట్ల సీఐడీ సోదాలు జరగడం సంచలనంగా మారింది. అలాగే హైదరాబాద్ కూటట్ పల్లిలోని లోథా బిల్డర్స్ లోని నారాయణ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా.. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు.

    ఈనెల 22న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు కంటే ఒకరోజు ముందు నారాయణను విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుపై పెట్టిన కేసులనే నారాయణపైనా నమోదు చేసిన అధికారులు 41 సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులిచ్చారు. విచారణలో భాగంగా అసైన్డ్ భూములకు సంబంధించిన జీవో 41 ఎలా జారీ చేశారు. ఇందులో ఎవరి ప్రయోజనాలైనా ఆశించారా అనే అంశంపై ప్రశ్నించే అవకాశముంది.

    ఇది చదవండి: సీఎం సొంత జిల్లాలో వైసీపీకి షాక్.. రాజీనామా చేసిన కౌన్సిలర్..



    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున్న భూకుంభకోణానికి తెర తీశారని తెలుగుదేశం అధినేత,నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు రెండు బృందాలుగా హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని.. రాజధానిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి నోటీసులు అందజేశారు.

    ఇది చదవండి: తిరుపతిలో పోటీపై డైలమాలో ఆ రెండు పార్టీలు.. అభ్యర్థిని ప్రకటించినా లాభం లేదా..



    ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. అలాగే మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. అటు మంత్రి నివాసాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్యకు మరోసారి నోటీసులు ఇచ్చారు.

    ఈ నోటీసులపై ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీలోని కీలక నేతలతో చర్చించారు. న్యాయవాదులు ఇచ్చిన సలహాలను వారికి వివరించారు. వారి సూచన మేరకు నోటీసులపై విచారణకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు. సిఐడి నోటీసులపై గురువారమే కోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తొంది. కేసు కొట్టివేత కోసం క్వాష్ పిటిషన్ వేసే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. అరెస్టులు లేకుండా విచారణ జరిగేలా చూడాలని కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. అయితే మరి ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించి విచారిస్తుందా? లేదా సీఐడీ విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేస్తుందా అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. .
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు