మాజీ మంత్రి అఖిలప్రియకు సీఐడీ నోటీసులు.. మరో ముగ్గురికి కూడా..

భూమా అఖిలప్రియ

మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు సీఐడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులు జారీచేశారు.

  • Share this:
    మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు సీఐడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని అఖిలప్రియ కొద్ది నెలల కిందట అఖిలప్రియ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హాఫీజ్ ఖాన్.. ఇందుకు సంబంధించిన సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు అఖిలప్రియకు నోటీసులు జారీచేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే ఈ నోటీసులపై ఇప్పటివకు అఖిలప్రియ గానీ, ఆమె కుటుంబం గానీ స్పందించలేదు.

    శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ చేశారని.. ఎమ్మెల్యేల తీరు చూసి అందరూ నవ్వుతున్నారని.. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది అప్పట్లో ఆమె కామెంట్ చేశారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన అఖిల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సైతం నంద్యాలలో శిల్పారవిచంద్ర కిశోర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: