ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో 'చౌకీదార్' పేరు మాయం

దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో మోదీ పాలనపై 56.4 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు.మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీకే ఓటేస్తామని 70% స్పష్టం చేశారు. మోదీ పాలనపై కేవలం 19.8 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

Lok sabha election result 2019 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి 'చౌకీదార్' పేరును తొలగించారు.

 • Share this:
  ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువగా వినిపించిన నినాదం 'చౌకీదార్'. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 'చౌకీదార్ చోర్ హై' అనే నినాదాన్ని వినిపిస్తే, భారతీయ జనతా పార్టీ 'మే భీ చౌకీదార్ హై' అంటూ కౌంటర్ చేసింది. అంతే కాదు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర్నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో తమ పేర్ల ముందు 'చౌకీదార్' ట్యాగ్ పెట్టుకున్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ కొన్ని గంటల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆయన పేరు ముందు 'చౌకీదార్' పదం మాయమైంది. "భారతదేశ ప్రజలంతా చౌకీదార్లు అయ్యారు. దేశానికి గొప్ప సేవ అందించారు. కులతత్వం, మతతత్వం, అవినీతి, ఆశ్రితపక్షపాతం లాంటి భూతాల నుంచి దేశాన్ని రక్షించేందుకు చౌకీదార్ బలమైన చిహ్నంగా మారడం విశేషం. చౌకీదార్ స్ఫూర్తిని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సమయం ఆసన్నమైంది" అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు నరేంద్ర మోదీ.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి 'చౌకీదార్' పేరును తొలగించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, టెక్స్ట్‌టైల్స్ మినిస్టర్ స్మృతి ఇరానీ కూడా 'చౌకీదార్' ట్యాగ్ తొలగించారు. #MainBhiChowkidar పేరుతో బీజేపీ ఇంతకాలం నిర్వహించిన ప్రచారానికి ఇక తెరపడినట్టే.

  నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి


  ఇవి కూడా చదవండి:

  Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

  IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

  PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?
  First published: