Andhra Pradesh: చంద్రబాబు నియోజకవర్గంలో దేవుడి విగ్రహాలు కూల్చింది ఎవరో తెలుసా? 24 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

కుప్పంలో విగ్రహాలను కూల్చింది ఎవరో తెలుసా? నిన్నటి వరకు ఈ విగ్రహాల కూల్చివేతపై రాజకీయ దుమారం రేగింది. కానీ ఈ కేసును కేవలం 24 గంటల్లోనే పోలీసులు చేధించారు.

  • Share this:
    ఏపీలో విగ్రహాల ధ్వంసం ఆగడం లేదు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నా ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర విగ్రహాల విధ్వంస ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న దేవాలయాలే కాదు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా దేవుడి విగ్రహాలు ధ్వసం కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. ఇప్పటికే దీనిపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక రాష్ట్రంలో విపక్షాలైతే వైసీపీ నేతలే ఈ విధ్వంస రచన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో సైతం ఇదే ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది..

    హింధూ దర్మ పరిరక్షణ కోసం బీజేపీని గెలిపించాలాని ఆ పార్టీ నినదిస్తోంది. అంతేకాదు వైసీపీ ప్రభుత్వంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని బీజేపీ, జనసేన, టీడీపీలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయినా ఏపీలో ఈ విగ్రహాల విధ్వంసం కొనసాగుతూనే వచ్చింది. తాజాగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో సైతం విగ్రహాలు ధ్వంసం అవ్వడం కలకలం రేపింది.

    చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎవరో  ధ్వంసం చేశారని ఆరోఫణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను చంద్రబాబుతో పాటు.. రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. కేవలం కుప్పంలోనే కాదని.. ఏపీ వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే అధికార పార్టీ నేతలు ఇలాంటి పనులు చేయిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. వైసీపీ నేతలు సైతం విమర్శలకు ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూడలేకనే.. ఇలాంటి కుట్రలకు ప్రత్యర్థి పార్టీలు తెరలైపాయని విమర్శిస్తున్నారు.

    అయితే ఎవరి విమర్శలు ఎలా ఉన్నా? చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యం స్వామి దేవుడి విగ్రహాల ధ్వంసం కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. అయితే అందరూ ఆరోపిస్తున్నట్టు ఇక్కడ కుట్రలు ఏమీ జరగలేదని పోలీసులు నిర్ధారించారు. ఓ మతి స్థిమితం లేని మహిళ ఈ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేశారు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌. విగ్రహాల ధ్వంసం సమయంలో మహిళ చేతికి గాయం కూడా అయినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. ఆమె కల్లు తాగిన మైకంలో ఘటనకు పాల్పడిందని చెప్పారు ఎస్పీ. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు.
    Published by:Nagesh Paina
    First published: