చిత్తూరులో టీడీపీకి బూస్టింగ్.. పార్టీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే

చిత్తూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబు టీడీపీలో చేరుతుండటంతో పార్టీ బలోపేతమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సీకే బాబు చేరికతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ విజయ అవకాశాలు మెరుగుపడుతాయని భావిస్తున్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 8:08 PM IST
చిత్తూరులో టీడీపీకి బూస్టింగ్.. పార్టీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు(File)
  • Share this:
ఏపీలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శత్రువులు మిత్రులు అవుతున్నారు.. మిత్రులు శత్రువులు అవుతున్నారు. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు. తాజాగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సీకే బాబు రాజకీయంగా తీవ్ర వైరుధ్యమున్న టీడీపీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. సీకే బాబు సైకిల్ ఎక్కనున్నారన్న వార్త చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

చిత్తూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబు టీడీపీలో చేరుతుండటంతో పార్టీ బలోపేతమవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సీకే బాబు చేరికతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ విజయ అవకాశాలు మెరుగుపడుతాయని భావిస్తున్నారు. సీకే బాబుతో పాటు ఆయన అనుచరులు, సన్నిహితులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు.కాగా, చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభకు టీడీపీ రాజంపేట ఎంపీ కేటాయించింది. నిజానికి సత్యప్రభ కుమారుడిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని భావించినా అందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో సత్యప్రభనే బరిలో దిగాల్సి వచ్చింది.
Published by: Srinivas Mittapalli
First published: March 22, 2019, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading