రోజాను హీరోయిన్ చేసింది శివప్రసాదే..

శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమాలో రోజా నటించినా.. హీరోయిన్‌గా పరిచయం అయింది మాత్రం ప్రేమతపస్సుతోనే. ఈ సినిమాకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు.

news18-telugu
Updated: September 21, 2019, 6:49 PM IST
రోజాను హీరోయిన్ చేసింది శివప్రసాదే..
శివప్రసాద్, రోజా
  • Share this:
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన శివకుమార్‌ నాటకరంగం నుంచి వెండితెరకు వెళ్లారు. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించారు. ఆ తర్వాత తనలోని ప్రతిభకు పదును పెట్టి నాలుగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. మెగాఫోన్ పట్టిన మొదటి సినిమాలో రోజాను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేశారు. అంతకు ముందు శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమాలో రోజా నటించినా.. హీరోయిన్‌గా పరిచయం అయింది మాత్రం ప్రేమతపస్సుతోనే. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పక్కన హీరోయిన్‌గా నటించింది. నారమల్లి శివప్రసాద్, ఆర్కే రోజా ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. మొదట శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. రోజా కూడా తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. వైఎస్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు.
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading