చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత.. ధ్రువీకరించిన అపోలో

Siva Prasad | చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ మధ్యాహ్నం 2.10 గంటలకు తుదిశ్వాస విడిచారు.

news18-telugu
Updated: September 21, 2019, 3:52 PM IST
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత.. ధ్రువీకరించిన అపోలో
ఎన్.శివప్రసాద్ (File)
  • Share this:
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ చనిపోయారు. ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌ చనిపోయారు. అయితే, శివప్రసాద్ చనిపోయినట్టు నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  దీనిపై న్యూస్‌18కి అపోలో ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. శివప్రసాద్ ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపింది. శివప్రసాద్‌కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని తెలిసింది. అయితే, ఇవాళ చనిపోయినట్టు కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తన చిరకాల మంత్రుడు చనిపోవడం విచారకరమన్నారు.సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన నారమల్లి శివప్రసాద్ 1994 - 2004 మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికై, చంద్రబాబునాయుడి కేబినెట్‌లో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు. శివప్రసాద్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading