జనసేనకు పీఆర్పీ టెన్షన్... పవన్ కళ్యాణ్‌కు కష్టమే ?

జనసేనను ఏ పార్టీలో విలీనం చేయబోనని... ఇప్పుడప్పుడే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా తమకు లేదని పవన్ కళ్యాణ్ తమ పార్టీకి చెందిన కొందరు నేతలకు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 31, 2019, 12:16 PM IST
జనసేనకు పీఆర్పీ టెన్షన్... పవన్ కళ్యాణ్‌కు కష్టమే ?
పవన్ కల్యాణ్(File)
news18-telugu
Updated: July 31, 2019, 12:16 PM IST
ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన జనసేన... మళ్లీ పుంజుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే జిల్లాల పర్యటనలకు మళ్లీ సిద్ధమవుతున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అంతకుముందే పార్టీకి చెందిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్. అయితే జనసేనను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంటే... ఆ పార్టీ నేతల్లో మాత్రం ఒకప్పటి ప్రజారాజ్యం భయాలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీ పార్టీని ఏర్పాటు చేసిన చిరంజీవి... ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయారు.

ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో...ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే ఇప్పుడు జనసేన నాయకులను, ఆ పార్టీ కార్యకర్తలను భయపెడుతోంది. చిరంజీవి తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారని రాజకీయవర్గాల్లో పుకార్లు వచ్చాయి. దీంతో దీనిపై స్వయంగా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

జనసేనను ఏ పార్టీలో విలీనం చేయబోనని... ఇప్పుడప్పుడే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా తమకు లేదని పవన్ కళ్యాణ్ తమ పార్టీకి చెందిన కొందరు నేతలకు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ క్యాడర్‌కు వివరించి చెప్పాలని ఆయన అన్నట్టు సమాచారం. మొత్తానికి జనసేన శ్రేణులను పీఆర్పీ భయం బలంగానే వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...