Home /News /politics /

CHIRANJEEVI IGNORES PAWAN KALYAN DEEKSHA AND PRAISES YS JAGAN FOR DISHA ACT MS

పవన్ దీక్ష రోజే జగన్‌కు జై కొట్టిన చిరంజీవి..

పవన్ కల్యాణ్,చిరంజీవి,వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ కల్యాణ్,చిరంజీవి,వైఎస్ జగన్మోహన్ రెడ్డి

మహిళల భద్రతకు జగన్ ప్రభుత్వం దిశా చట్టం చేయాలని నిర్ణయించడాన్ని చిరంజీవి అభినందించారు.

    రాజకీయాల్లో వ్యూహాత్మకత ముఖ్యం.ఒకే రాజకీయ పరివారానికి చెందినవారు భిన్నాభిప్రాయాలు వినిపిస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. నాయకుడి రాజకీయ ఆలోచనలతో విభేదించి సొంత అభిప్రాయాలను వినిపిస్తే ప్రజల్లో పార్టీ చులకన అవుతుంది.ఇదే తరహాలో ఇటీవల ఇంగ్లీష్ మీడియం బోధన అంశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విభేదించి.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక ఆయనకు
    షాక్ ఇచ్చారు.తాజాగా సొంత అన్న చిరంజీవి కూడా పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చినంత పనిచేశారు.రైతు సమస్యలపై పవన్ కల్యాణ్ సౌభాగ్య దీక్షకు దిగినరోజే.. అన్న చిరంజీవి జగన్‌ను అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

    మహిళల భద్రతకు జగన్ ప్రభుత్వం దిశా చట్టం చేయాలని నిర్ణయించడాన్ని ఆయన అభినందించారు. రాజకీయాలతో సంబంధం లేని విషయమే అయినా.. పవన్ కల్యాణ్ దీక్షకు దిగిన రోజు ఆ దీక్షను పట్టించుకోకుండా జగన్‌ నిర్ణయంపై మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెగాబ్రదర్స్ పవన్,నాగబాబు కాకినాడ దీక్షలో కూర్చుంటే.. మెగా బిగ్ బ్రదర్ చిరంజీవి హైదరాబాద్‌లో ఉండి జగన్‌ను మెచ్చుకుంటూ ప్రకటన విడుదల చేయడం జనసేనకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. అసలు జగన్‌ను ముఖ్యమంత్రి అని సంబోధించడానికి కూడా పవన్ విముఖత చూపుతున్న వేళ.. ముఖ్యమంత్రిగా జగన్ నిర్ణయాలను చిరంజీవి హర్షించడం చర్చనీయాంశమే.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Disa Rape and Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు