కరణం బలరాం మూడు కండిషన్లు... జగన్ ఓకే అంటే...

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో కొందరు మంత్రులు చర్చలు జరిపారు. అయితే, పార్టీలో చేరేందుకు కరణం బలరాం మూడు కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 5, 2019, 3:08 PM IST
కరణం బలరాం మూడు కండిషన్లు... జగన్ ఓకే అంటే...
కరణం బలరాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు జోరుగా చేస్తోంది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టికి దూరమయ్యారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీకి దూరం చేస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయవచ్చేది జగన్ మోహన్ రెడ్డి ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పక్కచూపులు చూస్తున్న ఎమ్మెల్యేల మీద వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో కొందరు మంత్రులు చర్చలు జరిపారు. అయితే, పార్టీలో చేరేందుకు కరణం బలరాం మూడు కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.

టీడీపీని నుంచి వైసీపీలో చేరడానికి రెడీ అయినా.. తన ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకు ఓకే అంటేనే తాను పార్టీ మారతానని తేల్చి చెప్పినట్టు సమాచారం. తన కుమారుడు కరణం వెంకటేష్‌కు కీలక పదవి అడిగినట్టు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఒంగోలు మేయర్ పదవిని తన కుమారుడికి ఇవ్వాలని కరణం కండిషన్ పెట్టినట్టు తెలిసింది. కరణం బలరాంకు ఒంగోలు పట్టణంలో మంచి పట్టు ఉంది. సర్వశక్తులు ఒడ్డి ఒంగోలు మున్సిపాలిటీలో వైసీపీని గెలిపిస్తానని, అయితే, తన కుమారుడికి మేయర్ పదవి ఇవ్వాలని కరణం బలరాం జగన్ దూతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఈ రెండింటితో పాటు ముఖ్యమైన మరో కండిషన్‌ కూడా కరణం పెట్టినట్టు తెలిసింది. చీరాల నియోజకవర్గంలో తననే ఇన్‌చార్జిగా నియమించడానికి జగన్ ఓకే అంటే పార్టీ మారేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు తెలిసింది. అయితే, పై రెండు విషయాలకు జగన్ ఓకే చెప్పినా.. చివరిది మాత్రం కొంచెం కష్టం. చీరాలలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ గత ఎన్నికల్లో కరణం బలరాం మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కరణం, ఆమంచి మధ్య వార్ బాగా పెరిగింది. నియోజకవర్గంలో తమ పట్టు నిలబెట్టుకోవాలని రెండు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా తెరపైకి వచ్చాయి. ఆమంచి కృష్ణమోహన్ సీఎం జగన్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి. మరి, పార్టీలో ముందే చేరిన ఆమంచిని కాదని, కరణం బలరాంకు నియోజకవర్గ బాధ్యతలు కట్టబెడతారా? అనేది ప్రశ్న.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading