ప్రకాశం జిల్లాలో ఆమంచి, కరణం వర్గాల కొట్లాట, పరస్పరం రాళ్లు రువ్వుకుని..

వేటపాలెం మండలం పందిళ్ల పల్లి గ్రామంలో ఆమంచి, కరణం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ళురువ్వుకున్నారు.

news18-telugu
Updated: October 31, 2020, 11:17 PM IST
ప్రకాశం జిల్లాలో ఆమంచి, కరణం వర్గాల కొట్లాట, పరస్పరం రాళ్లు రువ్వుకుని..
ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ కృష్ణమూర్తి (Images : Facebook)
  • Share this:
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ తలెత్తింది. వేటపాలెం మండలం పందిళ్ల పల్లి గ్రామంలో ఆమంచి, కరణం వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్ళురువ్వుకున్నారు. రాళ్శదాడిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పుట్టినరోజు సందర్భంగా పందిళ్ళపల్లి గ్రామంలో అంజిరెడ్డి అనే వ్యక్తి పార్టీ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటి సమీపంలో ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ తన నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆమంచి ఇంటిమీద నుంచి బలరాం పుట్టినరోజు వేడుకల ర్యాలీ కి పోలీసులు అనుమతి ఇచ్చారు. ర్యాలీ వెళుతున్న సమయంలో ఆమంచి వర్గీయుల తమపై వాటర్ బాటిల్స్ వేశారని కరణం వర్గీయుల ఆరోపించారు. అయితే, కరణం వర్గీయుల తమపై రాళ్ళు వేశారని ఆమంచి వర్గీయుల ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడిలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో చీరాలలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ఈ ఏడాది మార్చిలో వైసీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన కరణం బలరాం సీఎం జగన్‌కు జై కొట్టారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కరణం కుమారుడితో పాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైసీపీ గూటికి చేరారు. చేరికల కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఎమ్మెల్యే కరణం బలరాం కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఐతే ఆయన మాత్రం వైసీపీలో చేరలేదు. వల్లభనేని వంశీ తరహాలో బయటి నుంచే వైసీపీ ప్రభుత్వానికి కరణం బలరాం మద్దతు ప్రకటించారు.

కరణం బలరాం, ఆమంచి మధ్య చాలా కాలం నుంచి విబేధాలు ఉన్నాయి.  2019లో కరణం చేతిలో ఆమంచి ఓడిపోయారు. కరణం వైసీపీలో చేరడాన్ని ఆమంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చీరాల నియోజకవర్గంలో తమ పట్టు నిలబెట్టుకోవడానికి అటు ఎమ్మెల్యే కరణం బలరాం, ఇటు ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కూడా పలుమార్లు ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ ఆమంచి కృష్ణమోహన్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు కరణం బలరాం తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కరణం బలరాంకు నలుగురు సంతానం అయితే, ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ముగ్గురు సంతానం అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన కరణం బలరాంపై చర్యలు తీసుకోవాలని, ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2019 ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరఫున కరణం బలరాం పోటీ చేశారు. కరణం బలరాంకు 83,901 ఓట్లు వచ్చాయి. ఆమంచి కృష్ణమోహన్‌కు 66,482 ఓట్లు వచ్చాయి. దీంతో కరణం బలరాం 17,419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 31, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading