తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరితో కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ సమావేశం అయ్యారు. ఒంగోలులో వీఐపీ రోడ్డులో ఉన్న ఒక నివాసంలో సుజనా చౌదరి వారితో చర్చలు జరిపారు. ఓ గదిలో సుజనా, కరణం ఇద్దరూ రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన సుజనా చౌదరి.. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీతోపాటు చాలా మంది నేతలు బీజేపీ మీద సానుకూలంతో ఉన్నారని చెప్పారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసి రాజ్యాధికారం సాధించే దిశగా పయనిస్తోందని, ఆ బాధ్యతను తనకు అప్పగించిందని సుజనా చౌదరి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారితో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్లో ఉన్నారని సుజనా చౌదరి చెప్పారు. అయితే, ఎంతమంది బీజేపీలో చేరతారనే అంశం మీరే చూస్తారంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తుల లేదని, భవిష్యత్తు బీజేపీదేనన్నారు.
2019 ఏప్రిల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం, వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ మీద విజయం సాధించారు. అయితే, తాను ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ హవానే ఎక్కువగా నడుస్తుందనే అభిప్రాయం కరణం బలరాంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో చేరడం కంటే.. బీజేపీలో చేరితే ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చర్చలకు దిగినట్టు సమాచారం.
ధన్తేరస్ ఎందుకొచ్చింది.. బొమ్మల కథ
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.