‘టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం..’ గ్రామ వాలంటీర్ల ఎంపిక సమయంలో...

గ్రామ వాలంటీర్ల ఎంపిక విషయంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అధికారులను బెధిరించారని ఆమంచి ఆరోపించారు.

news18-telugu
Updated: August 9, 2019, 7:12 PM IST
‘టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం..’ గ్రామ వాలంటీర్ల ఎంపిక సమయంలో...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రభుత్వ అధికారులను బెదిరించడంతో పాటు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వినతిపత్రం ఇచ్చారు. చీరాలలో జరిగిన గ్రామవాలంటీర్ల ఎంపిక ప్రక్రియను సదరు ప్రభుత్వ అధికారులు నియమ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేశారని అయితే ఈ నెల 5న టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఆరుగురు ప్రభుత్వ అధికారులను రూంలో బంధించి ఆయన తీసుకువచ్చిన టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్పించారని ఆమంచి కృష్ణ మోహన్ మంత్రి బాలినేనికి తెలిపారు. అధికారులను బెదిరించి భయపెట్టడం వల్ల క్రింది స్థాయి అధికారులు భయాందోళనకు గురవుతున్నారని, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కరణం బలరాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమంచి కృష్ణ మోహన్ బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరారు.

 

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు