టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
కరణం బలరాం అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారంటూ ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
news18-telugu
Updated: July 6, 2019, 9:22 PM IST

ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ కృష్ణమూర్తి (Images : Facebook)
- News18 Telugu
- Last Updated: July 6, 2019, 9:22 PM IST
టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నిక చెల్లదంటూ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు కరణం బలరాం తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. కరణం బలరాంకు నలుగురు సంతానం అయితే, ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ముగ్గురు సంతానం అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన కరణం బలరాంపై చర్యలు తీసుకోవాలని, ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరణం బలరాం తప్పుడు సమాచారాన్ని అన్ని ఆధారాల తో కోర్ట్ లో నిరూపిస్తానని ఆమంచి తెలిపారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ తరఫున కరణం బలరాం పోటీ చేశారు. కరణం బలరాంకు 83,901 ఓట్లు వచ్చాయి. ఆమంచి కృష్ణమోహన్‌కు 66482 ఓట్లు వచ్చాయి. దీంతో కరణం బలరాం 17,419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Loading...