చింతమనేని అరెస్ట్.. ఏలూరు సబ్ జైలుకు తరలింపు..

Chintamaneni Prabhakar | తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. ‘నేనేమన్నా దేశద్రోహినా, ఇంతమంది పోలీసులు అవసరమా?’ అని వాదించారు.

news18-telugu
Updated: September 11, 2019, 6:55 PM IST
చింతమనేని అరెస్ట్.. ఏలూరు సబ్ జైలుకు తరలింపు..
చింతమనేని ప్రభాకర్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 11, 2019, 6:55 PM IST
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు. దళితుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన భార్య అనారోగ్యం కారణంగా చింతమనేని అజ్ఞాతం వీడారు. ఈ క్రమంలో పోలీసులు దుగ్గిరాలలోని ఆయన నివాసం వద్దకు భారీఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ వైపు పోలీసులు, మరోవైపు చింతమనేని అనుచరులు చేరడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కారులో ఉన్న చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా, ఆయన ప్రతిఘటించారు. దీంతో స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగి ఆయన్ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ, మరికొందరు పోలీసులు కలసి చింతమనేనిని లాక్కెళ్లి పోలీసు వాహనంలో కూర్చోబెట్టారు.

తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో చింతమనేని వాగ్వాదానికి దిగారు. ‘నేనేమన్నా దేశద్రోహినా, ఇంతమంది పోలీసులు అవసరమా?’ అని వాదించారు. మరోవైపు చింతమనేని అనుచరులు కూడా పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చింతమనేని ప్రభాకర్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరో 10 కేసులు కూడా నమోదయ్యాయి.

అనంతరం పోలీసులు చింతమనేనిని ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చింతమనేని ప్రభాకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో చిందమనేనికి కోర్టు ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను ఏలూరు సబ్ జైలుకు తరలించారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...