దిశ హత్యాచారంపై చినజీయర్ స్వామి రియాక్షన్..

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటే.. దేశం మొత్తం రాక్షసులు,హిరణ్యక్షులతో నిండిపోయినట్టుగా అనిపిస్తోందని ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 4, 2019, 3:02 PM IST
దిశ హత్యాచారంపై చినజీయర్ స్వామి రియాక్షన్..
చిన్నజీయర్ స్వామి
  • Share this:
గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలను చూస్తుంటే.. దేశం మొత్తం రాక్షసులు,హిరణ్యక్షులతో నిండిపోయినట్టుగా అనిపిస్తోందని ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాక్షసులకు తగిన శిక్షలు విధించకపోతే మరిన్ని ఘోరాలు జరుగుతాయని అన్నారు. నిందితులకు సరైన శిక్షలు పడకపోయినా.. శిక్షలు వాయిదా వేసినా.. ఇలాంటి చర్యలు నేరస్తులకు అలుసుగా మారుతాయన్నారు. కోర్టులు సరైన నిర్ణయం తీసుకుని దోషులకు కఠిన శిక్షలు అమలుచేయాలని భగవంతుడిని ప్రార్థిద్దామన్నారు.

అరబ్ దేశాల్లో చిన్న చిన్న దొంగతనాలకే నలుగురి ముందు నిల్చోబెట్టి వేళ్లు నరికేస్తారని చినజీయర్ చెప్పారు.పెద్ద నేరాలకైతే నడిరోడ్డు మీదే మరణశిక్షలు అమలుచేస్తారని చెప్పారు. దండనీతికి లోపం ఏర్పడితే దోషాలు పెరుగుతాయన్నారు.కాబట్టి చేసిన తప్పుకు సరైన దండన విధించకపోతే.. నేరస్తులను ప్రోత్సహించినట్టు అవుతుందన్నారు. దురదృష్టం కొద్ది మన దేశంలో దోషులు దొరికినా దండనీతి అమలుచేయలేకపోతున్నారని వాపోయారు. ఇంకోసారి నేరం చేయాలంటే 'ఖబడ్దార్' అన్న రీతిలో
అతను భయపడాలని చెప్పారు. నేరం ఎక్కడ జరిగినా వెంటనే శిక్షలు అమలుచేయాలని.. పాలకులు ఆవైపుగా స్పందించాలని కోరారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>