CHINNA JEEYAR SWAMY SENSATIONAL COMMENTS ON TEMPLE ATTACKS IN ANDHRA PRADESH BK
Tirumala: ఆ పని చేస్తే ఏపీలో ఆలయాలపై దాడులు తగ్గొచ్చు : త్రిదండి చిన్న జీయర్ స్వామి
శుక్రవారం ఉదయం తిరుమలను సందర్శించిన తిదండి చిన్న జియర్ స్వామీ తిరుమల దర్శనం అనంతరం ఏపీలో ఆలయాలపై జరుగుతున్నదాడులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో ఆలయాలపై దాడుల నివారణకు ఏం చేయాలో దేవాదాయశాఖా మంత్రి తో పాటు టీటిడీ చెర్మన్ కు కొన్ని సూచనలు చేశాన్నారాయన.
శుక్రవారం ఉదయం తిరుమలను సందర్శించిన తిదండి చిన్న జియర్ స్వామీ తిరుమల దర్శనం అనంతరం ఏపీలో ఆలయాలపై జరుగుతున్నదాడులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో ఆలయాలపై దాడుల నివారణకు ఏం చేయాలో దేవాదాయశాఖా మంత్రి తో పాటు టీటిడీ చెర్మన్ కు కొన్ని సూచనలు చేశాన్నారాయన.
త్రిదండి చిన్న జీయర్ స్వామీజి శుక్రవారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.ఆలయాలు మన దేశానికి మన ధర్మానికి, మూల కేంద్రాలని,ఆలయాల మీద ఆధారపడే అన్నీ కళలు ఉన్నాయన్నారాయన..టీటీడీ మీద ఆధారపడి కొన్ని లక్షలమంది జీవిస్తున్నారని, అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయాలపై పై దాడులు జరగడం చాలా బాధాకరమన్నారు. ఏపీలో ఈ దాడులు పరాకాష్టకి చేరుకున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు చిన్న జీయర్ స్వామీ రామతీర్థంలోని రాముడి విగ్రహంపై దాడి జరగడం తనను కలిచివేసిందని అన్నారు.
టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లకు దేవాలయాల రక్షణ వ్యవస్థపై కొన్ని సూచనలు చేశానని,ఆలయాల వద్ద భక్తులకు మౌళిక వసతులు కల్పిస్తే రాకపోకలు పెరిగి దుండగుల దాడులు నివారించవచ్చుని వారికి వివరించానని అన్నారు, ఏపీలో రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా ఆలయాలపై దాడులు జరిగాయని తెలిపారు..ఈ నేపధ్యంలోనే ధ్వంసమైన 27 ఆలయాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు.17 ఆలయాలపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని,ఈ ఆలయాలపై వివరణను టీటీడీ చైర్మన్ కు అందజేశామని, అందుకు వై.వి.సుబ్బారెడ్డి ఆ ఆలయాల పరిరక్షణపై సానుకూలంగా స్పందించారని తెలిపారు..రాయలసీమలో అద్భుతమైన ఆలయ సంపద ఉందని,8 నుండి 12వ శతాబ్దం వరకు నిర్మించిన అపూరూపమైన శిల్ప సంపద కలిగిన ఆలయాల బాహుళ్యం రాయలసీమలో ఉందని వివరించారు..అప్పటి శిల్ప సంపద ప్రస్తుత టెక్నాలజీతో సాధ్యం కాకపోవడం ఆశ్చర్యకరమన్నారు..కళ్లు చెదిరే శిల్ప సంపద ఉన్న పుష్పగిరి చెన్నకేశవ ఆలయం కూడా నిరాధారణకు గురైందని,ఆలయాలు బాగుంటే ప్రజల్లో నైతిక ప్రవృత్తి బాగుంటుందని తేలియజేసారు..ప్రభుత్వ పరిపాలనను ప్రజలు ధర్మబద్ధంగా అందుకోవడానికి ఆలయ పరిరక్షణ ఎంతో అవసరంమన్నారు.
రాయలసీమ పర్యటనలో కొందరు ముస్లిం సోదరులను కలిసినప్పుడు హిందూ-ముస్లిం-క్రిష్టియన్లందరూ సోదరుల్లా కలిసి మెలసి ఉన్నామని చెప్పడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారాయన,మా మధ్య అగ్ని రగల్చి గొడవలు పెట్టడానికే ఆలయాలపై దాడులు చేస్తున్నారని బాధను వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు..ఆలయాలు, మసీదులు, చర్చిలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి మతంపై ఉందని,వసతి లేని ఆలయాలను టీటీడీ ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రజల్లో మనోధైర్యం ఏర్పడితే రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా లాంటివి దూరమవుతాయని ఆయన తెలిపారు.
Published by:Balakrishna Medabayani
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.