అత్యాచార కేసులో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత అరెస్ట్..

BJP Leader Chinamyanand Arrest : చిన్మయానంద్‌కు ఉత్తరప్రదేశ్‌లో పలు ఆశ్రమాలు,విద్యా సంస్థలు ఉన్నాయి. చిన్మయానంద్‌కు చెందిన కాలేజీలో న్యాయశాస్త్రం చదువుతున్న ఓ విద్యార్థిని ఆయనపై అత్యాచార ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: September 20, 2019, 12:45 PM IST
అత్యాచార కేసులో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత అరెస్ట్..
స్వామి చిన్మయానంద్ (File Photo)
news18-telugu
Updated: September 20, 2019, 12:45 PM IST
న్యాయ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి,బీజేపీ నేత స్వామి చిన్మాయనంద్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.సహరన్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం షాజహన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాగా,చిన్మయానంద్‌కు ఉత్తరప్రదేశ్‌లో పలు ఆశ్రమాలు,విద్యా సంస్థలు ఉన్నాయి. చిన్మయానంద్‌కు చెందిన కాలేజీలో న్యాయశాస్త్రం చదువుతున్న ఓ విద్యార్థిని ఆయనపై అత్యాచార ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్టు చేశారు. అయితే బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం దీనిపై సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ పలుమార్లు చిన్మయానంద్‌ను విచారించినప్పటికీ.. ఆయనపై కేసు మాత్రం నమోదు చేయలేదు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటే గానీ పోలీసులు కేసు పెట్టరేమోనని బాధితురాలు వాపోయారు. ఆ తర్వాత కొద్ది గంటలకే సిట్ చిన్మయానంద్‌ను అదుపులోకి తీసుకుంది.First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...