చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్..

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెన్నైకి చేరుకున్నారు.  చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన కాసేపటి క్రితమే చెన్నైకి చేరుకున్నారు.   ఆయనకు తమిళనాడు సీఎం పళనిస్వామి, గవర్నర్, భారత అధికారులు ఘనస్వాగతం పలికారు.

news18-telugu
Updated: October 11, 2019, 2:36 PM IST
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్..
చైనా అధ్యక్షుడు జి-జిన్‌పింగ్ (Image : AP)
  • Share this:
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెన్నైకి చేరుకున్నారు.  చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన కాసేపటి క్రితమే చెన్నైకి చేరుకున్నారు.   ఆయనకు తమిళనాడు సీఎం పళనిస్వామి, గవర్నర్, భారత అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, జిన్‌పింగ్ సాయంత్రం 4 గంటలకు మహాబలిపురానికి చేరుకుంటారు. అక్కడ మోదీ ఆయనకు స్వాగతం పలకనున్నారు. వీరిద్దరు రెండు దేశాల మధ్య అంశాలు, వాణిజ్య విషయాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకుంటారనీ, ఏ ఒప్పందాలూ కుదుర్చుకునేది లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు అనంతరం  మోదీ, జిన్‌పింగ్ భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గతంలో 2018 ఏప్రిల్ 27, 28లో ప్రధాని మోదీ చైనా వెళ్లి వుహన్‌లో జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అప్పుడే మళ్లీ కలుద్దామని మోదీ అన్నట్లు తెలిసింది. ఆ క్రమంలో మరోసారి వీరిద్దరి భేటీ జరగబోతోంది.

ఇదిలా ఉండగా, మోదీ, జిన్‌పింగ్ భేటీ కోసం మహాబలిపురం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రెండు దేశాల జెండాలు, ధగధగమెరిసే కాంతులతో వెలుగుతోంది. మరోవైపు, పోలీసులు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఆంక్షలు విధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. నేడు, రేపు భారత్‌లో ఉండనున్న జిన్‌పింగ్.. సముద్రం పక్కన ఉన్న ఆలయాన్ని సందర్శిస్తారు. ఆయన రాక సందర్భంగా ఆలయాన్ని సరికొత్తగా ముస్తాబు చేశారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకను వ్యతిరేకిస్తూ చెన్నైలో టిబెట్ విద్యార్థుల ఆందోళన


 
First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading