మహారాష్ట్ర బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ థాక్రే... బీజేపీ ట్విస్ట్...

మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మహావికాస్ అగాఢీ విజయం సాధించింది.

news18-telugu
Updated: November 30, 2019, 4:45 PM IST
మహారాష్ట్ర బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ థాక్రే... బీజేపీ ట్విస్ట్...
ఉద్దవ్ థాక్రే (Image;PTI)
  • Share this:
మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం మహావికాస్ అగాఢీ విజయం సాధించింది. అయితే, బలపరీక్షకు ముందే బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రొటెం స్పీకర్ దిలీప్ పాటిల్ బలపరీక్షను నిర్వహించారు. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. వందేమాతరం ఆలపించకుండానే సభను ప్రారంభించడం నిబంధనలకు విరుద్ధమని ఆక్షేపించారు. అయితే, గవర్నర్ సూచనతో తాము సభను సమావేశపరిచామని ప్రొటెం స్పీకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అశోక్ చవాన్ విశ్వాసపరీక్షను ప్రతిపాదించారు. ఎన్సీపీ ఎమ్మెల్యే నవాబ్ మాలిక్, శివసేన సునీల్ ప్రభు మద్దతు పలికారు. అనంతరం సభ్యులు అందరినీ కూర్చోవాలని ప్రొటెం స్పీకర్ దిలీప్ పాటిల్ కోరారు. అయితే, అసలు రాజ్యాంగ విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారంటూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత సభలో ఉన్న ఎమ్మెల్యేలను లెక్కించగా 169 వచ్చింది. ఇద్దరు ఎంఐఎం, ఓ సీపీఐ ఎమ్మెల్యే బలపరీక్ష తీర్మానానికి వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ ఓటేయలేదు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో బలపరీక్షకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు.
First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading