Home /News /politics /

అయోధ్య తీర్పు : ఉత్తరప్రదేశ్ సీఎస్,డీజీపీలతో భేటీ కానున్న చీఫ్ జస్టిస్

అయోధ్య తీర్పు : ఉత్తరప్రదేశ్ సీఎస్,డీజీపీలతో భేటీ కానున్న చీఫ్ జస్టిస్

న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఫైల్ ఫోటో..

న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఫైల్ ఫోటో..

Ayodhya Verdict : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం అర్ధరాత్రి పోలీస్ ఉన్నతాధికారులు,డివిజనల్ కమిషనర్స్,జిల్లా మెజిస్ట్రేట్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో భద్రతకు సంబంధించి అవసరమైన సలహాలుసూచనలు ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  మూడు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతున్న అయోధ్య-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీ లోపు తుది తీర్పు వెల్లడించనున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో రంజన్ గొగొయ్ నేడు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ,డీజీపీలతో భేటీ కానున్నారు. తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణపై ఆరా తీయనున్నారు.

  మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం అర్ధరాత్రి పోలీస్ ఉన్నతాధికారులు,డివిజనల్ కమిషనర్స్,జిల్లా మెజిస్ట్రేట్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో భద్రతకు సంబంధించి అవసరమైన సలహాలుసూచనలు ఇచ్చారు. ప్రతీ జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తీర్పు తర్వాత ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు ఉండాలన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా చర్యల్లో భాగంగా యూపీ పోలీసులు రెండు హెలికాప్టర్లను కూడా సిద్దం చేశారు. ఇప్పటికే 20 తాత్కాళిక జైళ్లను కూడా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే అరెస్టులకు
  అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు.
  First published:

  Tags: Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Babri Masjid-Ram Janmabhoomi, CJI Ranjan Gogoi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు