చిదంబరంకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

వంబర్ 15న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంలో దాన్ని సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్.భానుమతి నేత్రుత్వంలోని ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్ లభించినట్టయింది.

news18-telugu
Updated: December 4, 2019, 11:05 AM IST
చిదంబరంకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం (File Photo)
  • Share this:
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. దీంతో 105 రోజుల తర్వాత చిదంబరం తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంలో దాన్ని సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్.భానుమతి నేత్రుత్వంలోని ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్ లభించినట్టయింది.

సుప్రీంలో వాదనల సందర్భంగా.. చిదంబరం బయటకొస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ గట్టిగా వాదించింది. ఈడీ తరుపున కేసు వాదించిన సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా.. చిదంబరం లాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ప్రత్యేకించి అధికార దుర్వినియోగానికి పాల్పడి మనీ లాండరింగ్ లేదా ఆర్థిక అవకతవలకు సంబంధించిన కేసుల్లో ఉన్నవారికి బెయిల్ ఇవ్వరాదన్నారు. అయితే నిరాధార ఆరోపణలతో చిదంబరాన్ని జైల్లో పెట్టాలనుకోవడం సరికాదని ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్,ఏంఎం సింఘ్వీ వాదించారు. చిదంబరం సాక్ష్యులను ప్రభావితం చేస్తారనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇరువురి వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈడీ వాదనతో ఏకీభవించని కోర్టు ఎట్టకేలకు చిదంబరంకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>