తీహార్ జైలుకు చిదంబరం... అప్పటి వరకు అక్కడే..

జెడ్ కేటగిరి భద్రత దృష్యాలో జైల్లో ప్రత్యేక సదుపాయాలకు కూడా కల్పించింది. వెస్ట్రన్ టాయిలెట్‌ సౌకర్యంతో పాటు మందులను అందించేందుకు అనుమతిచ్చింది.

news18-telugu
Updated: September 5, 2019, 6:08 PM IST
తీహార్ జైలుకు చిదంబరం... అప్పటి వరకు అక్కడే..
తీహార్ జైలుకు చిదంబరం తరలింపు
news18-telugu
Updated: September 5, 2019, 6:08 PM IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 19 వరకు అక్కడే ఉండనున్నారు చిదరబరం. సీబీఐ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరంను గురువారం కోర్టులో హాజరపరిచారు. దాంతో ఆయన్ను జుడిషియల్ కస్టడీకి అప్పగించింది స్పెషల్ కోర్టు. జైల్లో చిదంబరానికి ప్రత్యేక సెల్‌ను కేటాయించాలని కోర్టు ఆదేశించింది. జెడ్ కేటగిరి భద్రత దృష్యాలో జైల్లో ప్రత్యేక సదుపాయాలకు కూడా కల్పించింది. వెస్ట్రన్ టాయిలెట్‌ సౌకర్యంతో పాటు మందులను అందించేందుకు అనుమతిచ్చింది. ఇక చిదరంబరం సెల్ దగ్గర ఇద్దరు పోలీసులో భద్రత ఏర్పాటు చేయనున్నారు.

ఐఎన్ఎక్స్ ముడపుల కేసులో ఆగస్టు 21న సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. సీబీఐ కస్టడీలో 16 రోజుల పాటు ఉన్న చిదంబరం...ఇన్ని రోజులు సీబీఐ కార్యాలయంలో ఉన్నారు. ఇక సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో తనను ఈడీ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు చిదంబరం. ఐతే ఆ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. దాంతో చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...