తీహార్ జైల్లో చిదంబరంకు అస్వస్థత.. ఎయిమ్స్ ఆస్పత్రికి తరలింపు..

మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం (File Photo)

Chidambaram Referred to AIIMS : ఆరోగ్య సమస్యల రీత్యా తనకు ఇంటి భోజనం తెప్పించాలని చిదంబరం కోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. జైలు ఫుడ్ కారణంగా తాను 4 కిలోలు తగ్గిపోయానని కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

  • Share this:
    తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆయన కడుపునొప్పితో బాధపడటంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.మెడికల్ రిపోర్ట్స్‌ను బట్టి ఆయన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేసేది లేనిది డాక్టర్లు నిర్ణయించనున్నారు.సాధారణంగా తీహార్ జైలు ఖైదీలను దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లడం పరిపాటి. కానీ చిదంబరం విషయంలో కోర్టు ప్రత్యేక ఆదేశాలిచ్చింది.ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తితే తప్పనిసరిగా ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది.దీంతో ఆయన్ను ఎయిమ్స్‌కు తరలించారు.

    ఇదిలా ఉంటే, ఆరోగ్య సమస్యల రీత్యా తనకు ఇంటి భోజనం తెప్పించాలని చిదంబరం కోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. జైలు ఫుడ్ కారణంగా తాను 4 కిలోలు తగ్గిపోయానని కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
    అయితే కోర్టు మాత్రం అందుకు తిరస్కరించింది. తీహార్ జైల్లో మిగతా ఖైదీల్లాగే చిదంబరంకు ఆహారం అందించాలని తెలిపింది. కస్టడీ గడువును అక్టోబర్ 17వరకు పొడగించింది.బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది.    First published: