Chidambaram | చిదంబరంపై సీబీఐ కోర్టులో ఆసక్తికర వాదనలు..

Chidambaram | చిదంబరం ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. దానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. అయితే, అభిషేక్ సింఘ్వీ ఆయన్ను తప్పు పట్టారు.

news18-telugu
Updated: August 22, 2019, 5:21 PM IST
Chidambaram | చిదంబరంపై సీబీఐ కోర్టులో ఆసక్తికర వాదనలు..
చిదంబరం అరెస్ట్ పై న్యూస్‌18 క్రియేటివ్
news18-telugu
Updated: August 22, 2019, 5:21 PM IST
కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ ఆసక్తికరంగా జరిగింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. చిదంబరం తరఫున ఆయన మిత్రులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదించారు. చిదంబరం విచారణకు సహకరించలేదని సీబీఐ వాదించింది. ఆయన్ను విచారించేందుకు కనీసం ఐదు రోజుల కస్టీడీకి ఇవ్వాలని కోరింది. అయితే, చిదంబరాన్ని నిన్న రాత్రి అరెస్ట్ చేస్తే ఇవాళ ఉదయం 11 గంటల వరకు ఆయన్ను అసలు ప్రశ్నించలేదని కపిల్ సిబల్ వాదించారు. నాలుగైదు సార్లు పిలిచినా వెళ్లకపోతే అప్పుడు సహకరించలేదని అంటారని, అరెస్ట్ చేసి ప్రశ్నించిన తర్వాత ఇంకా సహకరించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.

ఈ సందర్భంగా చిదంబరం ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. దానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. అయితే, అభిషేక్ సింఘ్వీ ఆయన్ను తప్పు పట్టారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం నిందితుడికి తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే హక్కు ఉందన్నారు. అయితే, ఇదే పాయింట్‌ను తీసుకున్న సొలిసిటర్ జనరల్ సీబీఐకి కూడా ప్రశ్నించే హక్కు ఉందని, కాబట్టి దేశం కోసం వారు నిర్వర్తించే విధులను కొనసాగించేలా చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును అరగంట తర్వాత చెబుతామని ప్రకటించారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...