• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CHIDAMBARAM ARREST IN INX MEDIA CASE REMINDS THE ARREST OF M KARUNANIDHI IN 2001 MID NIGHT BA

Chidambaram Arrest | కరుణానిధి అరెస్ట్‌ను గుర్తు చేసిన చిదంబరం అరెస్ట్...

Chidambaram Arrest | కరుణానిధి అరెస్ట్‌ను గుర్తు చేసిన చిదంబరం అరెస్ట్...

చిదంబరం అరెస్ట్, కరుణానిధి (File)

Chidambaram Arrested | కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు రాత్రి 9.45 గంటలకు అరెస్ట్ చేశారు. 2001 జూన్ 30న అర్ధరాత్రి సమయంలో కరుణానిధి అరెస్ట్ జరిగింది.

  • Share this:
    కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని జోర్ బాగ్‌లో రాత్రి 9.45 గంటలకు చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. చిదంబరం కోసం 27 గంటల నుంచి ఎదురుచూస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఆయన తన నివాసానికి వచ్చినట్టు తెలుసుకోగానే అక్కడకు వెళ్లారు. అయితే, చిదంబరం ఇంటి గేటు తీయకపోవడంతో సీబీఐ అధికారులు ఏకంగా ఆయన ఇంటి గోడ దూకి లోపలకు వెళ్లారు. సుమారు 15 నుంచి 20 మంది సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అయితే, ఈడీ అధికారులు కూడా చిదంబరం కోసం వచ్చారు. కొంతసేపు చిదంబరం ఇంటి వద్ద ఉన్న అధికారులు ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అయితే, సీబీఐ అధికారులు రాత్రి.. గంటల సమయంలో చిదంబరాన్ని తమ కారులో తీసుకెళ్లారు. ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మురోవైపు చిదంబరం ఇంటి వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. పరస్పరం అనుకూల, వ్యతిరేక నినాదాలు చేయడంతో అక్కడ భారీ ఉద్రిక్త నెలకొంది.

    చిదంబరం ఇంటి వద్ద రాత్రి 9.45 గంటల సమయంలో జరిగిన ఈ హైడ్రామా గతంలో కరుణానిధి అరెస్టును గుర్తు చేసిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో జయలలిత అధికారంలో ఉండగా, డీఎంకే అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత కరుణానిధిని 2001 జూన్ 30న అర్ధరాత్రి అరెస్ట్ అయ్యారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ఫ్లైవర్‌కు సంబంధించి రూ.12 కోట్ల అవినీతి జరిగిందని కరుణానిధిపై అరోపణలు వచ్చాయి. దీంతో అర్థరాత్రి కరుణానిధి ఇంటికి వచ్చిన అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కరుణానిధి పంచె ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా పోలీసులు ఆయన్ను వ్యాన్ ఎక్కించారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది.  ఆశ్చర్యకరంగా ఇద్దరూ తమిళనాడుకు చెందిన నేతలే కావడం విశేషం.
    First published: