news18-telugu
Updated: October 21, 2018, 9:56 AM IST
అమిత్ షా, నరేంద్ర మోదీ..(File)
నవంబర్ 12, నవంబర్20న రెండు విడుతల్లో జరగనున్న ఛత్తీస్గఢ్ ఎన్నికల కోసం బీజేపీ శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 77 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 14మంది మహిళా అభ్యర్థులు ఉండగా.. మరో 14మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించినట్టు కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు.
బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాజీ ఐఏఎస్ అధికారి ఓపీ చౌదరి, ఇటీవల బీజేపీలో చేరిన గిరిజన నాయకుడు రామ్దయాళ్లకు కూడా చోటు దక్కింది. మరో 13మంది అభ్యర్థుల జాబితాను పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి నవంబర్ 12, నవంబర్20వ తేదీల్లో రెండు విడుతల్లో అసెంబ్లీఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో 18, రెండో దశలో 72 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Published by:
Srinivas Mittapalli
First published:
October 21, 2018, 9:56 AM IST