news18-telugu
Updated: November 22, 2018, 11:57 AM IST
ఈవీఎంకు పూజలు చేస్తున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి ఒకరు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలకు పూజలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ పూజలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా గత మంగళవారం 72 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. బేమెతర జిల్లాలోని నవగఢ్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆ రోజు ఓటింగ్ ప్రారంభానికి ముందు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి దయాల్‌దాస్ బాఘెల్ ఈవీఎంలకు పూజలు నిర్వహించారు. ఈవీఎం మిషన్‌కు దండం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టారు.
ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రిటర్నింగ్ అధికారి స్పందించారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలకు పూజలు నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి దయాల్దాస్కు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Published by:
Janardhan V
First published:
November 22, 2018, 11:49 AM IST