• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CHHATTISGARH LAST PHASE ELECTIONS HELD TO BE TUESDAY POLLING FOR 72 SEATS

ఛత్తీస్‌గఢ్‌లో రేపే తుది దశ పోలింగ్

ఛత్తీస్‌గఢ్‌లో రేపే తుది దశ పోలింగ్

ఛత్తీస్ గఢ్‌లో మంగళవారం తుదిదశ పోలింగ్

మంగళవారం 72 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి విడతకు లక్షమంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు, స్పీకర్ ధరమ్ లాల్ కౌశిక్, 9 మంది మంత్రులు, సీఎల్పీ నేత రవీంద్ర చౌబే సహా 843మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేల్చనున్నారు ఓటర్లు.

  • Share this:
    ఛత్తీస్‌గఢ్ మలిదశ పోలింగ్‌కు రెడీ అవుతుంది. మంగళవారం 72 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి విడతకు లక్షమంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు, స్పీకర్ ధరమ్ లాల్ కౌశిక్, 9 మంది మంత్రులు, సీఎల్పీ నేత రవీంద్ర చౌబే సహా 843మంది అభ్యర్థుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేల్చనున్నారు ఓటర్లు.

    ఛత్తీస్ గఢ్ మలిదశ ఎన్నికల్లో అధికార బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలవారు 72మంది చొప్పున పోటీలో ఉండగా... 75మంది మహిళలు కూడా బరిలో నిల్చున్నారు. ఆదివారంతో ప్రచార పర్వానికి తెర పడటంతో... చివరిరోజు క్యాంపెన్‌ను ముమ్మరం చేశారు రాజకీయ నేతలు. పార్టీ నేతల మాటల తూటాటు పేల్చుకున్నారు.

    ప్రతిపక్షాల వీక్ నెస్‌పై బీజేపీ దెబ్బకొడుతుంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు రఫెల్ అంశంపై బీజేపీని కాంగ్రెస్ కార్నర్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంబికాపూర్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

    మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 స్థానాలకు ఈ నెల 11వ తేదీన తొలిదశలోనే పోలింగ్ నిర్వహించారు. ఈ దశలో కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో.. తుది దశ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు