ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ

Chhattisgarh Exitpolls: ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని రెండు సర్వేలు చెబితే, కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందని మరో రెండు సర్వేలు అంచనా వేశాయి.


Updated: December 7, 2018, 6:34 PM IST
ఛత్తీస్‌గఢ్‌ ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
ప్రతీకాత్మక చిత్రం

Updated: December 7, 2018, 6:34 PM IST
ఛత్తీస్ గఢ్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ జాతీయ చానెల్స్, ఏజెన్సీలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ ఫలితాలు వచ్చాయి. రెండు ఏజెన్సీలు బీజేపీకే మళ్లీ ఓటర్లు పట్టం కడతారని చెబితే, మరో రెండు సర్వేలు మాత్రం పోటా పోటీగా ఉండొచ్చని అంచనా వేశాయి. టైమ్స్ నౌ - సీఎన్‌ఎక్స్, ఇండియా టీవీ రెండూ మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో రిపబ్లిక్ - సీ ఓటర్, న్యూస్ నేషన్ మాత్రం కాంగ్రెస్ పాగా వేయడం ఖాయమని జోస్యం చెప్పాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. 46 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
Loading...
సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్బీఎస్పీ ఇతరులు
టైమ్స్ నౌ - సీఎన్‌ఎక్స్ 46 35 7 2
రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ 35  - 43 40 - 50 3 - 7 0
న్యూస్ నేషన్ 38  - 42 40 - 44 4 - 8 0 - 4
ఇండియాటీవీ 42 - 50 32 - 38 6 - 8 1 - 3


First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...