news18-telugu
Updated: December 11, 2018, 10:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఛత్తీస్గఢ్లో కమలం వాడిపోతోంది. మొత్తం 90 స్థానాలకు గాను కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిచి అధికార పగ్గాలు హస్తగతం చేసుకుంది. అక్కడ గత 15 ఏళ్లుగా సాగుతున్న రమణ్ సింగ్ పాలనకు చరమగీతం పాటింది. అధికార బీజేపీ 16 స్థానాలకు పరిమితం అయ్యింది. అజిత్ జోగి- బీఎస్పీ కూటమి కేవలం 2 స్థానాల్లో గెలవగా...ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. మూడింట రెండువంతుల మెజార్టీ సొంతం చేసుకుని, అక్కడ అధికార పగ్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోనుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నాలుగోసారి సీఎంగా పగ్గాలు చేపట్టాలన్న రమణ్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి.

ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్కు పరాభవం
ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో పలు ఏజెన్సీలు బీజేపీకే మళ్లీ ఓటర్లు పట్టం కడతారని చెబితే, మరో రెండు సర్వేలు మాత్రం పోటా పోటీగా ఉండొచ్చని అంచనా వేశాయి. టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్, ఇండియా టీవీ రెండూ మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో రిపబ్లిక్ - సీ ఓటర్, న్యూస్ నేషన్ మాత్రం కాంగ్రెస్ పాగా వేయడం ఖాయమని జోస్యం చెప్పాయి. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. 46 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
Published by:
Janardhan V
First published:
December 11, 2018, 9:55 PM IST