• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CHHATTISGARH CM RAMAN SINGH FIRING COMMENTS ON RAHUL GANDHI

రాహుల్ ప్రచారం చేస్తే అంతే సంగతి..: రమణ్ సింగ్

రాహుల్ ప్రచారం చేస్తే అంతే సంగతి..: రమణ్ సింగ్

రమణ్ సింగ్(File)

కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్ గతంలో 18 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే.. ఆ రాష్ట్రాలన్నింటిలోనూ వారు ఓడిపోయారని రమణ్ సింగ్ గుర్తుచేశారు.

  • Share this:
    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సెటైర్స్ వేశారు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్. రాహుల్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలవేళ బీజేపీ అగ్రనాయకత్వమంతా ప్రచార బరిలో దిగగా.. రమణ్ సింగ్ కూడా శనివారం ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

    కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్ గతంలో 18 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే.. ఆ రాష్ట్రాలన్నింటిలోనూ వారు ఓడిపోయారని రమణ్ సింగ్ గుర్తుచేశారు. ఇక తెలంగాణ సీఎం గురించి ప్రస్తావిస్తూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామిని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామిలతో ప్రజలను మోసం చేశారని అన్నారు.అలాగే అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, కేవలం 30వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, గిట్టుబాటు ధర లేక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని మండిపడ్డారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు